News September 11, 2025
ముధోల్: గుండెపోటుతో యువ గాయకుడి మృతి

ముధోల్ గ్రామానికి చెందిన ముప్పిడి కిషోర్(32) యువ గాయకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం కరీంనగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన కిషోర్ బుధవారం HYDలో ఈవెంట్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. 2 నెలల కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని ముధోల్ తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు.
Similar News
News September 11, 2025
మహిళా సాధికారత కమిటీ సమావేశంలో డీకే అరుణ

ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో మహిళా సాధికారత కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈనెల 14, 15న మహిళా సాధికారత కమిటీ స్టడీ టూర్ నేపథ్యంలో APలో తిరుపతి వేదికగా కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. 2025లో ఎన్నికైన సభ్యుల పోర్టల్ ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.

నిజమైన ‘శ్రీమంతుడు’!

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్‌లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.