News September 11, 2025

KMR: 73 మందికి జరిమానా.. ఒకరికి జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై KMR జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కోర్టు జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాంతకమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

ఖమ్మం: పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ విషాదం నెలకొంది. మధిర, సత్తుపల్లి, గుండాల మండలాల్లో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News September 11, 2025

పవన్ బాపట్ల పర్యటన రద్దు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

News September 11, 2025

వరంగల్: తెల్ల కాగితం.. పట్టా రూపం..!

image

తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టా రూపంగా పాసుబుక్ ఇచ్చేందుకు మార్గం సుగుమమైంది. తాజాగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ద్వారా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్య అనధికార భూలావాదేవీలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించింది. ఉమ్మడి WGL జిల్లాలో 1,79,697 సాదాబైనామా దరఖాస్తులు రాగా కొంత మందికి మేలు జరగనుంది.