News April 4, 2024

ధర్మవరంలో వరుసగా మూడుసార్లు గెలిచిన నాయకుడు

image

ధర్మవరం నియోజకవర్గంలో జి.నాగిరెడ్డి ప్రత్యేకస్థానంగా చెప్పవచ్చు. 1983 నుంచి 1989 వరకు వరుసగా మూడుసార్లు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలోనే 40421అత్యధిక ఓట్ల మెజార్టీ, 1983లో 30605 రెండవ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ధర్మవరంలో ఈ రికార్డును బద్దలు కొడతారా కామెంట్ చేయండి.

Similar News

News January 16, 2026

అనంత: మరదలిని సుత్తితో కొట్టి చంపిన బావ

image

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్(25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.

News January 16, 2026

అనంత: కొండెక్కిన కోడి ధరలు

image

ఫర్వాట సందర్భంగా గుత్తిలో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేజీ చికెన్ ధర రూ.270, స్కిన్ లెస్ రూ.290 పలుకుతోంది. మరోపక్క కేజీ మటన్ రూ. 750 ఉండగా.. ఒక్కసారిగా రూ.50 పెరిగి రూ.800 కి విక్రయిస్తున్నట్లు మటన్ షాప్ నిర్వాహకుడు ఖురేషి అన్వర్ తెలిపారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.270 ఉండగా, అనంతపురంలో రూ.260-270 ఉంది.

News January 14, 2026

గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

image

గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో ఎస్పీ జగదీశ్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగురవేశారు. ఎస్పీ గుండాట ఆడి, ఉట్టి కొట్టారు.