News September 11, 2025
ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు?

వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రామప్ప వాన గుట్టకు పులి అరుపులు వినిపించాయని స్థానికులు తెలపగా, అటవీ శాఖ అధికారులు వానగుట్ట ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. రామప్ప వానగుట్ట నుంచి ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతం మీదుగా పులి మేడారం వైపు వెళ్తుండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News September 11, 2025
HYD: తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఏడాదికి PG చేరడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. SEP 19, 20న ఉ. 11 గంటల నుంచి సా. 4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫొటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600/- DD సమర్పించాలని సూచించారు.
News September 11, 2025
ములుగు: అల్లుడు చేతిలో మేనత్త హత్య

ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో మేనల్లుడి చేతిలో మేనత్త దారుణ హత్యకు గురైన ఘటన గురువారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొండగొర్ల విజయ్ (35) అనే వ్యక్తి తన మేనత్త కొండగొర్ల ఎల్లక్క (55)ను కత్తితో పొడిచి చంపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 11, 2025
కేయూలో నేటి నుంచి పురుషుల కబడ్డీ సెలక్షన్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ తెలిపారు. గురువారం, శుక్రవారం కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నేతృత్వంలో క్రీడా ప్రాంగణంలో ఎంపికలు చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం కేయూ క్యాంపస్ కళాశాలలో సంప్రదించాలన్నారు.