News September 11, 2025
MHBD: కలెక్టర్ పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త వాట్సాప్ నంబర్ సృష్టించినట్లు తెలిసిందని, ఈ నకిలీ నంబర్‌కు ఎవరూ స్పందించవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, కలెక్టర్ పేరుతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించవద్దన్నారు.
Similar News
News March 13, 2026
భద్రాద్రి: లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట ఇటీవల 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్నారని చెప్పారు.
News March 13, 2026
నిబంధనలు పాటించాల్సిందే: కలెక్టర్

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 65 కేంద్రాల్లో 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు మినహా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. సందేహాల నివృత్తికి 9959670118 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.


