News September 11, 2025

సంగారెడ్డి: పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎఎన్ఎం, అకౌంటెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విధాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోగ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Similar News

News September 11, 2025

పాక్‌తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

image

INDvsPAK మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.

News September 11, 2025

భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్‌లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

News September 11, 2025

‘నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు.. అవసరమైతే స్కూళ్లకు సెలవు’

image

నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాలలోని పాఠశాలలకు విద్యార్థులు రాలేని పక్షంలో సెలవు ఇవ్వాలని ఎంఈవోలకు సూచించారు. పరిస్థితిని బట్టి ఎంఈవోలే నిర్ణయం తీసుకోవాలన్నారు. నేడు పాఠశాలలకు సెలవు ఇస్తే.. రెండో శనివారం రోజున నడపాలని పేర్కొన్నారు.