News September 11, 2025
గ్రామాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయండి: చిన్నారెడ్డి

గ్రామాల్లో జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చేలా అప్పట్లో రాజీవ్ గాంధీ రూపొందించారని గుర్తు చేశారు.
Similar News
News March 18, 2026
MBNR : ఉడిత్యాలలో 36.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బాలానగర్ 30.8, నవాబుపేట మండలం కొల్లూరు 26.3, మిడ్జిల్ 21.5, నవాబుపేట 15.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 12.5, మహబూబ్ నగర్ అర్బన్ 11.7, జడ్చర్ల 10.3, మహమ్మదాబాద్ 9.3, గండేడ్ మండలం సల్కర్ పేట 5.5, దేవరకద్ర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News March 18, 2026
MBNR: LPG సిలిండర్ల సరఫరాపై కంట్రోల్ రూమ్

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటల్స్‌లో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ నిల్వలపై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రెడ్డి 9666052780, అబ్దుల్ జలీల్ 9912659005లను సంప్రదించాలన్నారు.
News March 18, 2026
MBNR: సిలిండర్ల అక్రమ నిల్వలపై నిఘా.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడినా, నిల్వ ఉంచినా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.


