News September 11, 2025

జగిత్యాల: CUET పరీక్ష ఫలితాల్లో విద్యార్థినుల ప్రతిభ

image

జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినులు సీయూఈటీ (CUET) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శ్వేత, ప్రత్యూష, స్రవంతి, ఇందు, దీప్తి నాయక్, ప్రవళిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు వారిని అభినందించారు.

Similar News

News March 15, 2026

గుడా పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

హుకుంపేటలో గుడా GTWAH పాఠశాలను ఆదివారం కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎస్.ఎస్.ఎస్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. వారి పరీక్షల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి “ఆల్ ది బెస్ట్” తెలియజేశారు.

News March 15, 2026

మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

image

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.

News March 15, 2026

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

image

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.