News September 11, 2025
సంగారెడ్డి: తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, వసతి గృహాలను తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆదేశాలు ఇచ్చారు. లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలను ఇచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు వివరాలను ఎంఈవోలు తనిఖీలు చేసి వెంటనే ఇవ్వాలన్నారు.
Similar News
News September 11, 2025
ఖమ్మంలో అటవీ అమరవీరులకు కలెక్టర్ నివాళి

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా అటవీశాఖ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, CP సునీల్ దత్, తదితరులు పాల్గొన్నారు.
News September 11, 2025
లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్‌లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.
News September 11, 2025
ఏలూరు: పాము కాటుకు గురై ఒకరు మృతి

లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఏసుపాదం (48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గ్రామంలో పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.