News September 11, 2025

ములుగు జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు

image

ములుగు జిల్లాలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ తుది జాబితాను ప్రకటించినట్లు అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు తెలిపారు. జిల్లాలో 10 జడ్పీటీసీ, 83 ఎంపీటీసీ స్థానాలకు గాను 473 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, ఇతరులు 22 మంది ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News September 11, 2025

నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

తమిళనాడులోని <>నైవేలి<<>> లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ 28 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.854, ఎస్సీ, ఎస్టీలు రూ.354 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://www.nlcindia.in/

News September 11, 2025

కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు

image

కృష్ణా జిల్లాలో రోజురోజుకు గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గన్నవరం, బాపులపాడులలో పట్టపగలు మహిళల గొలుసులు లాక్కుని దొంగలు పారిపోయారు. ప్రస్తుతం బంగారం గ్రాము ధర రూ.10 వేలు దాటడంతో మహిళలు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ క్రమంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

News September 11, 2025

సైబర్ మోసానికి గురైన కాకినాడ ఎంపీ

image

కాకినాడ ఎంపీ ఉదయశ్రీనివాస్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆయన ఫైనాన్స్ మేనేజర్‌కు 4 రోజుల క్రితం ఓ ఆగంతకుడు ఎంపీ డీపీతో ఉన్న వాట్సాప్ సందేశం పంపాడు. తాను కొత్త నంబర్ వాడుతున్నా, నగదు బదిలీ చేయాలని సూచిస్తే అది నిజమని నమ్మిన మేనేజర్ 11 విడతల్లో రూ.92 లక్షల బదిలీ చేశారు. దీనిని ఈనెల 8న ఎంపీ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎక్కడ జరిగింది అన్నది బయటికి రాలేదు. ఇది నిజమేనని ఎంపీ పీఏ తెలిపారు.