News September 11, 2025

నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీ బలం: మర్రి జనార్దన్ రెడ్డి

image

అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్, పదర మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

Similar News

News March 20, 2026

మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

image

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.

News March 20, 2026

KMR: మాక్ డ్రిల్ ఏర్పాట్లను పర్వేక్షించిన జిల్లా అధికారులు

image

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో మరోసారి మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. శుక్రవారం పెద్దచెరువు ప్రాంతంలో మాక్ డ్రిల్ ఏర్పాట్లను జిల్లా ఫైర్ సేఫ్టీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ నెల 24న జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనుండగా, ఆయా శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్‌ను ఈ నెల 25న చేపట్టనున్నారు.

News March 20, 2026

అనకాపల్లి: పెరిగిన పవర్ పెట్రోల్ ధర

image

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అనకాపల్లిలో పవర్ పెట్రోల్ ధర పెరిగింది. పెరిగిన ధర శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చిందని కోటవురట్లలో పెట్రోల్ బంక్ యాజమాన్యం తెలిపింది. లీటరు పవర్ పెట్రోల్ ధర ఉదయం 6 గంటలకు ముందు వరకు రూ.116.87 ఉండగా.. 6 గంటల తర్వాత నుంచి రూ.119.06కి పెరిగింది. సాధారణ పెట్రోల్ ధరలు పెరగలేదు.