News September 11, 2025
సిద్దిపేట: ‘అడ్మిషన్లకు 12 చివరి తేదీ’

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 12 చివరి తేదీ అని సిద్దిపేట రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోసం అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2026
NTR: సర్పంచ్‌ని తొలగించకుండా తాత్సారం!

పెనుగంచిప్రోలు పంచాయతీలో రూ. 1.21 కోట్ల భారీ అవినీతి జరిగిందని విచారణలో నిర్ధారణ అయినా, అధికారులు మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. FEB 23తో వివరణ గడువు ముగిసినా సర్పంచ్ ‘చెక్ పవర్’ రద్దు చేయలేదు. విచారణాధికారి తన వల్ల కాదంటూ చేతులెత్తేయడం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనుండటంతో, విచారణను సాగదీసి నిందితులను కాపాడే కుట్ర జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News March 18, 2026
విజయవాడలో ఏఎస్ఐ ఆత్మహత్య

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ గోపి బుధవారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఓ కేసు వివాదంలో సస్పెన్షన్‌కు గురైన ఆయన, అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. యనమలకుదురులో నివాసముంటున్న గోపి.. కుటుంబ కలహాల నేపథ్యం లేదా సస్పెన్షన్ బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News March 18, 2026
సూర్యాపేట: ఎక్కడ పర్యటన ఉన్నా.. ముందుగా బడికే!

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 23 మండలాల్లో ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా స్థానిక బడులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేలా టీచర్లకు సూచనలు ఇస్తున్నారు. కలెక్టర్ పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


