News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
Similar News
News September 11, 2025
ఏ వాస్తు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.
News September 11, 2025
వాస్తు శాస్త్రాన్ని అంత మంది రుషులు ఎందుకు రచించారు?

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఓ వ్యక్తి ఆలోచన మాత్రమే కాదు. ఇది అనేకమంది రుషుల జ్ఞానం, అనుభవం నుంచి పుట్టింది. ఇతిహాసాలు, పురాణాలను ఎంతో మంది కవులు, పండితులు తమదైన శైలిలో రచించినట్లే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎందరో మహర్షులు సమాజ శ్రేయస్సు కోసం రాశారు. వారి రచనల్లో పదాలు వేరుగా ఉన్నప్పటికీ, పరమార్థం ఒకటే ఉంటుంది. వీళ్లందరూ మానవుల జీవితం సుఖశాంతులతో సాగడానికి సరైన మార్గాన్ని చూపించారు.
News September 11, 2025
శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం

TG: ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.