News April 4, 2024

సంగారెడ్డి ప్రమాదంలో మృతుల వివరాలు..

image

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్‌ రవికుమార్‌ (హైదరాబాద్‌), ప్రొడక్షన్ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం (36), దయానంద్‌ (48), సురేష్‌పాల్‌ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష జరిపారు.

Similar News

News July 8, 2025

రామాయంపేట: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ HBT బోధించేందుకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన అభ్యర్థులకు అవకాశం ఉందని, రూ.18,200 వేతనం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 8, 2025

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలి: మెదక్ కలెక్టర్

image

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కొల్చారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

News July 8, 2025

మెదక్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

మెదక్ ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.