News September 11, 2025
ములుగులో మొదటి దవాఖాన..!

ములుగు ప్రాంతంలో తొలిసారిగా 1911లో ప్రభుత్వ సంచార వైద్యశాల ఏర్పాటయిందని మీలో ఎవరికైనా తెలుసా..?. ఈ ఆసక్తికర విషయాన్ని చరిత్ర పరిశోధకుడు, రాష్ట్ర ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ తెలిపారు. నాటి నిజాం ప్రభుత్వం దస్తూర్-ఉల్-అమల్ చట్టాన్ని అనుసరించి ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. 1931లో శాశ్వత భవనం నిర్మించారు. ఏటూరునాగారంలో 1921లో తొలి ఆస్పత్రి ఏర్పాటైంది.
Similar News
News March 11, 2026
LPG ఉత్పత్తిని పెంచుతున్నాం: రిలయన్స్ ఇండస్ట్రీస్

గ్లోబల్ ఇంధన మార్కెట్లలో అస్థిరత నేపథ్యంలో LPG ఉత్పత్తిని పెంచుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దేశ ప్రజలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జామ్ నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్‌లో LPG ఉత్పత్తిని మాక్సిమైజ్ చేసినట్లు పేర్కొంది. భారతీయ కుటుంబాల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తెలిపింది.
News March 11, 2026
HEADLINES

* గల్ఫ్ యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత!
* కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతతో మూతపడుతున్న హోటళ్లు
* LPG ఉత్పత్తి 10% పెంచాం: కేంద్రం
* ఈ నెల 13న PM కిసాన్ నిధుల విడుదల
* అంతర్జాతీయ స్థాయి క్రీడలకు అమరావతి సిద్ధం: CBN
* 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: TG ప్రభుత్వం
* పెరిగిన బంగారం, వెండి ధరలు
* దాడులు తీవ్రం చేస్తామన్న US.. వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్
News March 11, 2026
ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.


