News September 11, 2025

నేడు బాపట్లకు రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం బాపట్లలో పర్యటించనున్నారు. ఉదయం 8:45 గంటలకు మంగళగిరిలో బయలుదేరి 9:15 గంటలకు బాపట్ల చేరుకుంటారు. 9:20లకు GGW కార్యక్రమంలో పాల్గొంటారు.10:15 గంటలకు అటవీ శాఖ అమరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు. 1 గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో బుధవారం సూర్యలంక రహదారిలోని నగరవనం వద్ద పోలీస్ సిబ్బందికి SP తుషార్ డూడి బ్రీఫింగ్ నిర్వహించారు.

Similar News

News March 10, 2026

125 రోజుల పని దినాల పోస్టర్ ఆవిష్కరణ

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G రామ్ జీ చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. గ్రామీణ కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పన, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 125 రోజుల పనిదినాల అమలుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 10, 2026

ఈ బాబు బతకాలంటే రూ.17 కోట్ల ఇంజెక్షన్ కావాలి..

image

సత్యసాయి జిల్లా లేపాక్షికి చెందిన నటరాజ్, శైలజ దంపతుల 3ఏళ్ల కుమారుడు అద్విక్ అరుదైన ‘ఎస్‌ఎంఏ టైప్-2’ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది నయం కావాలంటే రూ.17కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని బెంగళూరు వైద్యులు తెలిపారు. అంత మొత్తం భరించలేక ఆ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డను కాపాడాలని ప్రభుత్వం, దాతలను వారు వేడుకుంటున్నారు. దాతలు స్పందించి చిన్నారికి పునర్జన్మ ప్రసాదించాలని కోరుతున్నారు.

News March 10, 2026

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృథ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.