News September 11, 2025
ఏలూరు జిల్లాలో బౌద్ధ, జైన గుహలు

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. గుహలు, చైత్యాలు, విహారాలు, స్థూపాలతో ఈ ప్రదేశం చారిత్రక క్షేత్రంగా నిలిచింది. పురావస్తు తవ్వకాలలో ధాతుకరండాలు, శాసనాలు లభించాయి. మొదట బౌద్ధ కేంద్రంగా పేరుగాంచినా, తర్వాత జైనమతం ప్రభావం కూడా ఉన్నట్లు ఆధారాలు వెల్లడించాయి. అక్కడ మహిళలు నిద్రిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
Similar News
News March 14, 2026
WGL: చికెన్ ధరలు… కిలో రూ.300 దాటింది

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో చికెన్ కిలో ధర రూ.300 దాటగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజులుగా ధరలు రూ.280 కంటే తగ్గడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. వేసవి తీవ్రతతో కోళ్లు చనిపోవడం వల్ల ఫాముల్లో ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.
News March 14, 2026
అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 ఉద్యోగాలు

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండి, 21-38 ఏళ్ల మధ్య వయసు వారు అప్లై చేయొచ్చు. జీతం రూ.18,730- రూ.68,040 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ MAR 20 నుంచి ప్రారంభం. చివరి తేదీ APR-19. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు acab.bank.in చూడండి.
News March 14, 2026
మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.


