News September 11, 2025
రేపు పాడేరులో ఆరోగ్య పరీక్ష శిబిరం

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం (రేపు) ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు తెలిపారు.
Similar News
News March 25, 2026
మంథని JNTUHకి 16 ఏళ్లు..!

గ్రామీణ యువతకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే సంకల్పంతో మార్చి 25, 2010న మంథని JNTUHని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. PDPL(D) రామగిరి(M) కల్వచర్లలో NAAC- ‘A+’ గ్రేడ్ గుర్తింపుతో, 52 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, హాస్టల్ వసతులతో అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్మాణానికి సింగరేణి సహకారం అందించినందుకు ఉద్యోగుల పిల్లలకు 10% సీట్లను ప్రభుత్వం కేటాయించింది.
News March 25, 2026
విజయవాడ: రూ. 2 కోట్ల ఆశచూపి రూ.36 లక్షలు కొట్టేశాడు..!

పెట్టుబడుల పేరుతో హనుమంతరెడ్డి అనే వ్యక్తిని హరిప్రసాద్ అనే కేటుగాడు దారుణంగా మోసగించాడు. బందర్ రోడ్డులో రూ. 2 కోట్ల నగదు ఉందంటూ ఓ సూట్‌కేస్ ఇచ్చి, ప్రతిగా హనుమంతరెడ్డి వద్ద ఉన్న రూ.36 లక్షలు తీసుకుని ఉడాయించాడు. తీరా సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు ఉండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News March 25, 2026
సూర్యాపేటలో కొత్త నియోజకవర్గ చర్చ!

నియోజకవర్గాల పునర్విభజనపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పునర్విభజన జరిగితే సూర్యాపేటను రెండుగా విభజించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. సూర్యాపేట టౌన్, రూరల్ మండలాలను కలిపి ‘సూర్యాపేట అర్బన్’ నియోజకవర్గంగా.. ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్‌తో పాటు కోదాడలోని మోతె మండలాన్ని కలిపి ‘సూర్యాపేట రూరల్’ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.


