News September 11, 2025
GNT: కానిస్టేబుల్ కొడుకు నుంచి డీజీపీ స్థాయికి ఎదిగారు

మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో 1955 సెప్టెంబర్ 11న జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు కానిస్టేబుల్, 1979లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌గా నియమితులైన తరువాత కూడా ఉన్నత చదువులు చదివారు. సెప్టెంబర్ 30, 2013న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఫిజిక్స్‌పై మక్కువతో తరంగ సిద్ధాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రీసెర్చ్ చేస్తూనే ఉండేవారు.
Similar News
News September 11, 2025
కామారెడ్డి: జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు: కలెక్టర్

KMR జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ప్రాజెక్టులు, చెరువులను గుర్తించాలన్నారు. అత్యవసర పరిస్థితిల్లో టోల్ ఫ్రీ నంబర్ 08468-220069కు సంప్రదించాలన్నారు.
News September 11, 2025
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు: ఏఎస్‌పీ మౌనిక

ఏప్రిల్‌లో దేవరకొండలోని హనుమాన్ నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధరను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ మౌనిక తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దొంగతనంలో రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని.. నిందితుడిపై సుమారు 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్‌పీ తెలిపారు.
News September 11, 2025
కృష్ణా: జెడ్పీ సమావేశంలో కీలక నిర్ణయం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ZPTCల పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలకు సంబంధించి గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనం రూ.74.93 లక్షలు ZP సాధారణ నిధుల నుంచి చెల్లింపునకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఛైర్‌పర్సన్ హారిక నిండు సభలో తెలియజేయగా సభ్యులు హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కోసం సభ్యులు గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.