News September 11, 2025
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ

డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. $393 బిలియన్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ల్యారీకి ట్రంప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి.
Similar News
News March 7, 2026
రఘురామ కేసు: సమాధానాలు దాటవేసిన IPS సునీల్?

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో IPS అధికారి సునీల్ నాయక్ మూడో రోజు విచారణ ముగిసింది. గుంటూరు CCS పోలీస్ స్టేషన్‌లో అధికారులు 7గంటల పాటు ప్రశ్నించారు. రఘురామను గుంటూరుకు తరలించిన టైమ్‌లో అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని అడిగిన ప్రశ్నలకు సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రేపు, ఎల్లుండి కూడా ఈ విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
News March 7, 2026
గోల్డ్ రింగ్, పెళ్లికి 8గ్రా. బంగారం.. సాధ్యమేనా?

TNలో ఎన్నికల వేళ TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19322449>>హామీల<<>>పై చర్చ జరుగుతోంది. పిల్లలు పుడితే గోల్డ్ రింగ్, అమ్మాయి పెళ్లికి 8గ్రా. బంగారం ఇస్తామని ఇవాళ ప్రకటించారు. మిగతా వాటిని అటుంచితే బంగారం హామీ హాట్ టాపిక్ అయింది. ఇది వినడానికి బాగానే ఉన్నా 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షన్నరకు పైగా ఉన్న తరుణంలో అమలు సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హామీలకు హద్దులుండవా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. మీరేమంటారు?
News March 7, 2026
రేపు వరుణ్ ఆడతాడా? సూర్య రెస్పాన్స్ ఇదే..

T20 WC: టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. దీంతో ఫైనల్లో అతణ్ని తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై కెప్టెన్ సూర్య స్పందించారు. ‘వరుణ్ ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇది టీమ్ స్పోర్ట్. అతని ఒక్కడి పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం లేదు. అతడు వరల్డ్ నం.1 బౌలర్. టీమ్‌ను ఎలా గెలిపించాలో అతనికి తెలుసు’ అంటూ వరుణ్‌ను వెనకేసుకొచ్చారు. జట్టులో మార్పులు రేపే తెలుస్తాయన్నారు.


