News September 11, 2025
HYD: మీరు వినరు.. వారు వదలరు

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.
Similar News
News September 11, 2025
ఇలా ఉంటే మీ డిప్రెషన్ తొలగుతుంది!

ప్రస్తుతం చాలా మందిలో డిప్రెషన్, అసూయ, అభద్రతా భావం నెలకొంటోంది. అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలపాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మానసిక వైద్యుడు శ్రీకాంత్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మనకున్నది కోల్పోతే అది దిగులు. మనకులేనిది పక్కోడికి ఉంటే అది అసూయ. మనకున్నది పోతుంది అనుకుంటే ఆందోళన. అదే మనకేమీ లేదనుకుంటే ఇలాంటి సమస్యలేవీ ఉండవు’ అని ఆయన తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News September 11, 2025
సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.