News September 11, 2025
కర్రల సమరానికి ముహూర్తం ఫిక్స్

కర్రల సమరం.. ఈ పేరు వినగానే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఈనెల 27న గణపతి పూజ, స్వామివారి కంకణ ధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణంతో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 2న బన్నీ ఉత్సవం ఉంటుంది. ఇందులో ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు.
Similar News
News March 25, 2026
జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 25, 2026
రింకూకు KKR ప్రమోషన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.
News March 25, 2026
మెట్‌పల్లి: పసుపు క్వింటాల్ రూ.13,189

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,189, కనిష్ఠం రూ. 9,226, పసుపు గోళ గరిష్ఠం రూ. 11,688, కనిష్ఠం రూ. 9,111, పసుపు చూర గరిష్ఠం రూ. 11,405, కనిష్ఠం రూ. 8,829గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 2,448 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.


