News September 11, 2025
కృష్ణా: ఫొటో గ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 19-45 ఏళ్ల పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రేషన్ ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత మెటీరియల్, భోజనం వసతి సదుపాయాలు ఉంటాయని వివరించారు.
Similar News
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
గుంటూరు: గుడారాల పండగకు ప్రత్యేక రైళ్లు

గుడారాల పండగ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 8 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. నం.17258 కాకినాడపోర్టు – విజయవాడ, నం.67229/67230 విజయవాడ గుంటూరు, గుంటూరు విజయవాడ, నం17257 విజయవాడ – కాకినాడ పోర్ట్, ఈ రైళ్లను ఆయా తేదీలలో నడపనున్నట్లు ప్రకటించారు.
News March 4, 2026
ఖమ్మం: మొక్కజొన్న రైతులకు దక్కని భరోసా

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉండగా, బయట మార్కెట్లో దళారులు రూ.1,900కే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చేలోపే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యంగా కేంద్రాలు తెరిస్తే దళారులకే లాభమని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


