News September 11, 2025
బతుకమ్మ సంబరాలు.. జిల్లాకు రూ.30లక్షలు

TG: ఎప్పటిలాగే ఈసారి కూడా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాకు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.1.20 కోట్ల నిధులు కేటాయించింది. ఈనెల 21న వరంగల్ వేయిస్తంభాల గుడిలో జరగనున్న సంబరాలతో వేడుకలు మొదలవుతాయి. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది ఆడపడుచులు బతుకమ్మ ఆడనున్నారు. 30న ట్యాంక్‌బండ్ వద్ద జరిగే వేడుకలతో సంబరాలు ముగియనున్నాయి.
Similar News
News September 11, 2025
సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల

AP: సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే CM వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే CM లక్ష్యం’ అని స్పష్టం చేశారు.
News September 11, 2025
ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా ఎదిగాం: RCB

బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత SM నుంచి విరామం తీసుకున్న RCB కొద్దిరోజులుగా వరుస ట్వీట్స్ చేస్తోంది. తాజాగా IPL లీడర్‌బోర్డ్‌ను షేర్ చేసింది. ‘బర్నింగ్ డిజైర్, కన్సిస్టెంట్ అప్రోచ్, బోల్డ్ ప్రామీస్.. ఈ ప్రయాణమే మనల్ని ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా నిలబెట్టింది. నిజాయితీ, నమ్మకంతో ఒక్కో మెట్టును పేర్చుతూ నిర్మించుకున్నాం’ అని పేర్కొంది. కాగా 2020 నుంచి RCB 90 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో టాప్‌లో ఉంది.
News September 11, 2025
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <