News September 11, 2025

నేడు అనకాపల్లిలో మెగా జాబ్ మేళా

image

అనకాపల్లి రాజా థియేటర్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల యువతీ యువకులు అర్హులుగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు.

Similar News

News September 11, 2025

ఏలూరు: పాము కాటుకు గురై ఒకరు మృతి

image

లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఏసుపాదం (48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గ్రామంలో పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 11, 2025

నెల్లూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 5.58 లక్షలు స్వాహా

image

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

News September 11, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.