News September 11, 2025

జూబ్లీహిల్స్: ఆశల పల్లకిలో ‘హస్తం’ అభ్యర్థులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. BRS నుంచి మాగంటి సునీతకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. BJP నుంచి లంకల దీపక్‌ రెడ్డి, ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఆశల పల్లకిలో విహరించడం గమనార్హం.

Similar News

News September 11, 2025

సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

image

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.

News September 11, 2025

HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

image

సచివాలయంలో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్‌ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News September 11, 2025

నేపాల్ అల్లర్లు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

image

నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు చర్యలు చేపట్టింది. నేపాల్‌లో ఉన్న మన వాళ్ల గురించి కుటుంబసభ్యులు ఫోన్ చేసి వివరాలుతెలుసుకోవచ్చు. 9871999044, 9643723157, 9949351270 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.