News September 11, 2025

ఎవరీ సుశీల?

image

నేపాల్ నిరసనకారులు తాత్కాలిక <<17670125>>PMగా<<>> ఎన్నుకున్న సుశీల కర్కీ సుప్రీంకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్. 1952లో జన్మించిన ఆమె, UPలోని బనారస్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపుపొందారు. 2016లో SC చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టి, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. దీంతో ఆమెపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, అది వీగిపోయింది. 2017లో రిటైరయ్యారు.

Similar News

News March 24, 2026

బుమ్రాకు గాయమా? MIకి టెన్షన్!

image

MI స్టార్ పేసర్ బుమ్రా IPL 2026 ప్రారంభానికి ముందు బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. టోర్నీ మొదలవ్వడానికి కొన్ని రోజులే ఉండగా ఆయన ముంబై క్యాంప్‌లో చేరడానికి బదులు అక్కడికి వెళ్లడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రొటీన్ చెక్ అప్ కోసమా లేక ఏదైనా గాయమా అన్నది తెలియాల్సి ఉంది. ఆదివారం KKRతో జరగనున్న తొలి మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటారా లేదా చూడాలి.

News March 24, 2026

మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

image

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.

News March 24, 2026

కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

image

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.