News September 11, 2025
భద్రాద్రి: MPTC/ZPTC ఓటర్ల లెక్క తేలింది..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు 22 ZPTC, 233 MPTC స్థానాల వారీగా తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,69,048 మంది ఓటర్లతో పాటు 1,271 పోలింగ్ స్టేషన్లను ప్రకటించారు. జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. ఇక ఎన్నికల తేదీలే ప్రకటించాల్సి ఉంది.
Similar News
News March 11, 2026
చిత్తూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

యుద్ధం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోనూ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుకింగ్ OTP ఉంటేనే సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాతే సిలిండర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కష్టాలు లేకపోయినా పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు తప్పేటట్లు లేదు.
News March 11, 2026
LPG, CNG, PNG, LNGకి తేడాలు తెలుసా?

LPG (Liquefied Petroleum Gas): ఇళ్లలో వంట కోసం వాడతారు.
CNG (Compressed Natural Gas): వాహనాల్లో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
PNG (Piped Natural Gas): గ్యాస్‌ను పైపులైన్ల ద్వారా నేరుగా ఇళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రీలకు చేరుస్తారు. మీటర్ రీడింగ్ ప్రకారం బిల్ వేస్తారు. వంటగ్యాస్ సిలిండర్లకు ఇది ప్రత్యామ్నాయం.
LNG (Liquefied Natural Gas): దీన్ని ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్లలో వాడతారు.
News March 11, 2026
పుంగనూరు జాతరకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

పెద్దపంజాణి మండలం కమ్మినపల్లికి చెందిన భరత్(20), శ్రీధర్(22), గిరి బైకుపై పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చారు. తిరిగి మంగళవారం రాత్రి ఇంటికి బయల్దేరారు. మాదనపల్లె క్రాస్ వద్ద అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్నారు. భరత్, శ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. గిరి తీవ్రంగా గాయపడ్డాడు.


