News September 11, 2025

ఖమ్మం: KU పీజీ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్‌) 4వ సెమిస్టర్‌ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్‌ ఏప్రిల్‌, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్‌ జూన్‌, ఎంఏ(ఇంగ్లిష్‌) మొదటి సెమిస్టర్‌ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాల కోసం www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌‌లో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News March 13, 2026

వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు నేటి నుంచి కొత్త విధానం

image

TG: వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. నేటి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ వెల్లడించింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. 2 పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

News March 13, 2026

అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై నివేదిక

image

అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన బొజ్జన్న కొండ, కొండకర్ల ఆవ, సముద్రతీర ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ విజయ కృష్ణన్ నివేదికను అందజేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News March 13, 2026

ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

image

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <>annadathasukhibhava.ap.gov.in/<<>>లో చెక్ చేసుకోవచ్చు.