News September 11, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యత

image

AP: పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్) ప్రోగ్రామ్ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి సగటున 3 క్లస్టర్‌లు కేటాయించింది. 1,08,311 మంది 2.14 లక్షల క్లస్టర్లలోని 21.56 లక్షల బంగారు కుటుంబాల బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. మార్గదర్శులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ బంగారు కుటుంబాలకు సాయం అందేలా చూడాలి.

Similar News

News September 11, 2025

గృహ హింస కేసు.. హీరోయిన్‌కు నిరాశ

image

గృహ హింస కేసులో హీరోయిన్ <<15080954>>హన్సిక<<>>కు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2021లో ముస్కాన్‌కు హన్సిక సోదరుడు ప్రశాంత్‌తో పెళ్లవ్వగా పలు కారణాలతో విడిపోవాలనుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్‌తో పాటు ఆయన తల్లి జ్యోతి, హన్సిక తనను మానసికంగా వేధిస్తున్నారని ముస్కాన్‌ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో హన్సిక, జ్యోతికి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

News September 11, 2025

మహిళల వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి..

image

మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఈ సారి టోర్నీలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలుగా మహిళలే ఉండనున్నారు. దీంతో పూర్తిగా మహిళలతోనే వన్డే వరల్డ్‌కప్ నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. గతంలో మహిళల టీ20 వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మహిళా అంపైర్లు, రిఫరీలను నియమించారు. భారత్, శ్రీలంక ఆతిథ్యంలో వన్డే WC సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది.

News September 11, 2025

పెండింగ్‌లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు

image

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల్లో 50శాతం క్యాప్ ఎత్తేస్తూ ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొంది.