News September 11, 2025
చల్లపల్లి: పాఠశాల అన్నంలో పురుగులు

చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 11, 2025
గరికపాడులో జిల్లా జూడో జట్ల ఎంపిక

తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.
News September 11, 2025
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 11, 2025
కృష్ణా జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.