News September 11, 2025

NLG: స్థానిక ఎన్నికలపై సందిగ్ధం..!

image

స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో జిల్లాలో ఆయా గ్రామాల్లో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ జడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంత వరకూ రాలేదు. దీంతో రాజకీయ పార్టీల నేతలు గందరగోళంలో పడ్డారు.

Similar News

News March 19, 2026

నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది

image

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల లక్ష్యంలో భాగంగా, జూన్ 12 నాటికి 6,409 గృహాలను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అత్యధిక ఇళ్లను నిర్మించిన జిల్లాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని NLG రికార్డు సృష్టించింది. ఇప్పటికే 1809 గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి.

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.