News September 11, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూలు

TUకి నూతనంగా ఏర్పాటైన ఇంజినీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి పరిపాలన భవనంలో గురువారం ఉదయం 11 గం.లకు టీయూ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ECE/EEE, మెకానికల్/సివిల్ సబ్జెక్టుల్లో 6 పోస్టులున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో PGలో 65% ఉత్తీర్ణత, Ph.D/NET, 2 సం.రాల బోధనానుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు.
Similar News
News March 3, 2026
బెంగళూరులో 5 మ్యాచులు ఆడతాం: RCB

IPL-2026లో <<16603983>>బెంగళూరులో<<>> 5 మ్యాచులు ఆడనున్నట్లు RCB ప్రకటించింది. మిగిలిన 2 హోమ్ మ్యాచులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆడతామని వెల్లడించింది. ‘చిన్నస్వామి స్టేడియం మాకు సొంత గ్రౌండ్ కన్నా ఎక్కువ. మా గుర్తింపు ఇక్కడే. అభిమానులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచులను వారు చూడాలి. చర్చలు, అనుమతుల ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని RCB CEO రాజేశ్ మేనన్ తెలిపారు.
News March 3, 2026
నెల్లూరు జిల్లాలో ప్రేమజంట సూసైడ్

నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట మృతి కలకలం రేపింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25)కు సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఏమైందో ఏమో రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద ఉరేసుకున్నారు. పురుగుల మందు తాగిన తర్వాత ఉరేసుకుని ఉంటారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
News March 3, 2026
కృష్ణా: కానిస్టేబుల్‌పై దాడి.. యువకులపై కేసు..!

కోడూరు మండలం విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ జాతరలో సోమవారం అర్ధరాత్రి కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చాణిక్య తెలిపారు. రాత్రి జాతరలో డీజే సౌండ్ తగ్గించాలని చెప్పిన కానిస్టేబుల్ వేణు స్వామిపై పిట్టలంక గ్రామానికి చెందిన కోట మహేశ్, నరేశ్ దాడి చేశారన్నారు. వేణు స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


