News September 11, 2025
మిల్స్‌కాలనీ పరిధిలో పట్టుబడిన పేకాటరాయుళ్లు

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. తెల్లవారుజామున మిల్స్ కాలనీ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడిని నిర్వహించారు. ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేయగా, మరొకరు తప్పించుకున్నారని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News March 10, 2026
HNK: డిజిటల్ విధానంలో తొలిసారిగా జనాభా గణన

దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ విధానంలో జనాభా గణన ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి డిజిటల్ రూపంలో జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగే మొట్ట మొదటి జనాబా గణన అన్నారు. ఇక్కడ మొదటి దశలో జరిగే హౌస్‌లిస్టింగ్(ఇళ్ల జాబితా), గృహాల గణన 2026 మే 11న ప్రారంభమై 2026 జూన్ 9న ముగుస్తుందన్నారు.
News March 10, 2026
నిజామాబాద్: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. 2వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
12న ప్రజా ప్రతినిధులకు శిక్షణ: కామారెడ్డి కలెక్టర్

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.


