News September 11, 2025

వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి మొదటి దర్శనం

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి కుమ్మరివారి ఇంటి నుంచి అమ్మవారి ప్రతిమను మెట్టినిల్లు అయిన చాకలివారి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దిష్టి చుక్క, కళ్లు పెట్టారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆపై ఊరేగింపుగా పోలేరమ్మ ప్రధాన గుడి వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టించారు. నయన మనోహరంగా ఉన్న పోలేరమ్మను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.

Similar News

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 15, 2026

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

image

రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లబరచి అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

News March 15, 2026

విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్‌లకు మోసపోవద్దు: శివశంకర్

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.