News September 11, 2025
ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: అనకాపల్లి డీఈవో

ఓపెన్ స్కూల్ ద్వారా దూరవిద్య విధానంలో పదవ తరగతి, ఇంటర్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అప్పారావు నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్ళు నిండినవారు పదవ తరగతిలో చేరి సెలవు దినాల్లో శిక్షణ పొంది పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి పాస్ అయిన వారు కళాశాలలో చేరకుండా నేరుగా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్షలు రాయవచ్చునని అన్నారు.
Similar News
News September 11, 2025
కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: MP

కాజీపేటను రైల్వే డివిజన్ చేస్తే వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడానికి సీఎం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఎంపీ పాల్గొన్నారు. ఉద్యోగ కల్పన, వ్యాపార వృద్ధి, వరంగల్ కీలకమైన కనెక్టివిటీ హబ్‌గా ఉంటుందని, కాజీపేట డివిజన్ ఏర్పాటుతో రైల్వేకు అత్యధిక రెవెన్యూ అందించబడుతుందని పేర్కొన్నారు.
News September 11, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు TGPSC..!

TG: <<17655670>>గ్రూప్-1<<>> మెయిన్స్ ఫలితాల రద్దు తీర్పుపై అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై కమిషన్ ఇవాళ సమావేశమైంది. బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి.
News September 11, 2025
VZM: ‘శిశు మరణాలు సంభవించకుండా చర్యలు’

విజయనగరం జిల్లా వైద్యారోగ్య శాఖ సమన్వయ సమావేశాన్ని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది. DMHO జీవన రాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆగస్టు నెలలో సంభవించిన 3 శిశు మరణాలపై సమీక్షించారు. భవిష్యత్తులో శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని DMHO సూచించారు. గర్భస్థ దశలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, గర్భిణీలలో రక్తహీనత నివారణకు ఐరన్ టాబ్లెట్లు అందించాలన్నారు.