News September 11, 2025
ఖమ్మం: రేషన్ సమస్యలకు హెల్ప్‌లైన్ నెంబర్

రేషన్ పంపిణీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అన్నా సహాయత’ పేరుతో ఫిర్యాదులను స్వీకరిస్తోందని DSO చందన్ కుమార్ తెలిపారు. రేషన్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఈప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాట్సాప్ నంబర్ 98682 00445, IVR నంబర్ 14457కు కాల్ చేసి వాయిస్ ద్వారా ఫిర్యాదులను తెలియజేయొచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 15, 2026
ఖమ్మంలో వర్షాల హెచ్చరిక.. రైతులకు జాగ్రత్తలు

నేటి నుంచి 20 వరకు ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి నరసింహారావు తెలిపారు. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు సంభవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. మార్చి 18, 19 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వెల్లడించారు. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకుని గాలులు, వడగళ్ల వానల వల్ల నష్టం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News March 15, 2026
ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.


