News September 11, 2025
MHBD జిల్లా వ్యాప్తంగా 5,56,780 మంది ఓటర్లు

జిల్లాలో 18 మండలాల్లో 18 ZPTCలు, 193 MPTCలు స్థానాలను ఖరారు చేశారు. ఒక్కో MPTC పరిధిలో జనాభా ప్రకారం రెండు, మూడు జీపీలు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 5,56,780 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,73,692 మంది, మహిళా ఓటర్లు 2,83,064మంది ఉన్నారు. 1,066 పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు.
Similar News
News March 17, 2026
మరో కీలక ఇరాన్ నేత టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడి

యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వ్యవహారాల్లో కీలకంగా మారిన ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి చేశాయి. ఈ అటాక్‌లో లారిజనీ మరణించారా? లేదా? అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రాత్రి జరిపిన దాడుల్లో పారామిలటరీ చీఫ్ గొలమ్‌రెజానూ టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
News March 17, 2026
వనపర్తి: పకడ్బందీగా జన గణనలో నిర్వహించాలి

దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణన తప్పులు లేకుండా చేసేందుకు నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహనకలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో మార్చి 15 నుంచి 17 వరకు జిల్లా సెన్సస్ ఛార్జి అధికారులకు నిర్వహిస్తున్న 3రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చన్నారు.
News March 17, 2026
SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.


