News September 11, 2025

నేడు తిరువూరుకు ‘కిష్కింధపురి’ మూవీ టీమ్

image

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘కిష్కింధపురి’ సినిమా యూనిట్ గురువారం తిరువూరులోని శ్రీ వాహిని కళాశాలలో సందడి చేయనుంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం మూవీ టీమ్ మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Similar News

News September 11, 2025

సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

image

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.

ఐశ్వర్యారాయ్‌ AI ఫొటోస్ తొలగించండి: ఢిల్లీ HC

image

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్ఫ్‌డ్ ఫొటోస్‌ను అడల్ట్ సైట్స్‌లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్, URLsను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇది ఆమె పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది.