News September 11, 2025

నల్గొండ: యాంత్రీకరణ పథకం అమలయ్యేనా..?

image

నల్గొండ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం కోసం ప్రభుత్వం రూ.3.17 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు నిధులు ట్రెజరీకి చేరలేదు. దీంతో 1,400 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పనిముట్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉన్నారు. సకాలంలో పనిముట్లు రాకపోతే పథకం ఉద్దేశం నెరవేరదని రైతులు అంటున్నారు.

Similar News

News November 4, 2025

నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.

News November 4, 2025

NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

image

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

News November 4, 2025

NLG: పత్తి కొనుగోళ్లలో కొర్రీలు.. రైతులు బేజారు!

image

జిల్లాలో ప్రారంభించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పత్తి కొనుగోలు కేంద్రాలలో తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పత్తి మిల్లు యజమానులు దళారులు కుమ్మక్కై సీసీఐ కేంద్రాలలో పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా.. తేమ ఉందని చెబుతూ రూ. 6,500కే కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. తేమ శాతం 8 నుంచి 12% ఉంటేనే పత్తి కొంటామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.