News September 11, 2025
నిజమైన ‘శ్రీమంతుడు’!

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్‌లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Similar News
News September 11, 2025
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News September 11, 2025
నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
News September 11, 2025
భారత విపక్షం వెనుక విదేశీ హస్తం: భండారీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ఓట్ చోరీ’ ప్రజెంటేషన్‌పై BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘రాహుల్‌ను ఏ ఫారిన్ బాస్ నడిపిస్తున్నారు? AUG 7న ఓట్ చోరీపై వెబ్‌సైట్లో 3PDFs అప్‌లోడ్ చేశారు. అవి మయన్మార్ నుంచి అప్‌లోడ్ అయ్యాయి. ఆధారాలంటూ ఆయన చూపినవి ఇండియాలో తయారవ్వలేదు. భారత విపక్షం వెనుక విదేశీ హస్తముందని బయటపడింది. రాహుల్, కాంగ్రెస్ డెమోక్రసీకి అత్యంత ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు.