News September 11, 2025
కరీంనగర్: విజృంభిస్తున్న విష జ్వరాలు..!

ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దోమలు పెరిగి, డెంగీ, టైఫాయిడ్, విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 14 వేల ఓపీలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అలాగే రామగిరి(M)కి చెందిన ఒకరు విషజ్వరంతో మృతి చెందారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 24, 2026
ఆర్డీటీ పోరాటం సఫలం: మాజీ ఎంపీ తలారి రంగయ్య

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోసం చేసిన పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గుంజి తాండ నుంచి చేపట్టిన పాదయాత్ర, పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా సంస్థకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News March 24, 2026
లోక్ అదాలకు సద్వినియోగం చేసుకోండి: నిర్మల్ ఎస్పీ

ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు.
News March 24, 2026
అమెరికాలో 40 శాతం పెరిగిన డీజిల్ ధరలు

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఆ దేశానికి ₹లక్షల కోట్లు ఖర్చవుతోంది. మరోవైపు డీజిల్ ధరలు 40 శాతం మేర పెరిగాయి. గ్యాలన్ ధర $5.29కు(ఒక గ్యాలన్=3.78 లీటర్లు) చేరుకుంది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నుంచి రోజుకు 10-15 లక్షల బ్యారెళ్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా 30 లక్షలకు చేరుకోవచ్చన్నారు.


