News September 11, 2025
వరంగల్: తెల్ల కాగితం.. పట్టా రూపం..!

తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టా రూపంగా పాసుబుక్ ఇచ్చేందుకు మార్గం సుగుమమైంది. తాజాగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ద్వారా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్య అనధికార భూలావాదేవీలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించింది. ఉమ్మడి WGL జిల్లాలో 1,79,697 సాదాబైనామా దరఖాస్తులు రాగా కొంత మందికి మేలు జరగనుంది.
Similar News
News March 22, 2026
ఒంగోలులో జాబ్ మేళా.. రూ.41 వేల జీతం.!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పలు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, 18 నుంచి 35 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు. రూ.14 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం అందే అవకాశం ఉందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చన్నారు.
News March 22, 2026
SRH 250 స్కోర్ చేసినా లాభం లేదు: ఆకాశ్ చోప్రా

IPL-2026లో SRH జట్టు 250 రన్స్ చేసినా లాభం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఆ జట్టులో బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అంత బలహీనంగా ఆ జట్టు బౌలింగ్ ఉందని అన్నారు. ‘కమిన్స్, ఎషాన్ మలింగా అందుబాటులో లేకపోవడంతో బ్రైడన్ కార్స్‌ను ఆడించాల్సి వస్తుంది. ఇండియన్ బౌలర్లతో మేనేజ్ చేయడమూ సవాలే’ అని పేర్కొన్నారు.
News March 22, 2026
VZM: జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారుల సత్తా

24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. మార్చి 18-21 వరకు భువనేశ్వర్‌లో జరిగిన పోటీల్లో గుమ్మలక్ష్మీపురానికి చెందిన కె.లలిత 400 మీ, 1500 మీ.ల పరుగు పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్ సాధించగా.. బొబ్బిలికి చెందిన కె.గౌతమ్ లాంగ్ జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు.


