News September 11, 2025
ఖమ్మం: పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ విషాదం నెలకొంది. మధిర, సత్తుపల్లి, గుండాల మండలాల్లో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News September 11, 2025
అర్హులకు చేయూత ఫించన్ లబ్ధి చేకూరేలా చర్యలు: సిరిసిల్ల కలెక్టర్

చేయూత పింఛన్లపై అవగాహన సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం నిర్వహించారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు తదితరులకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 11, 2025
నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
News September 11, 2025
NRPT: మహిళల రక్షణే షి టీమ్ ప్రధాన లక్ష్యం

మహిళలకు రక్షణ కల్పించేందుకే షి టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం తెలిపారు. ఎక్కడ ఆకతాయిల నుంచి మహిళలకు, విద్యార్థినులకు వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. నేరుగా లేదా 87126 70398 ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.