News September 11, 2025
OTT డీల్స్‌తో బడ్జెట్ రికవరీ!

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈక్రమంలో ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది. ఏకంగా రూ.125కోట్లకు అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు పొందినట్లు టాక్. అలాగే నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ క్రేజ్‌ను వాడుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ₹80కోట్లకు స్ట్రీమింగ్ హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో బడ్జెట్‌లో 80% వచ్చేసిందట.
Similar News
News September 11, 2025
ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా ఎదిగాం: RCB

బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత SM నుంచి విరామం తీసుకున్న RCB కొద్దిరోజులుగా వరుస ట్వీట్స్ చేస్తోంది. తాజాగా IPL లీడర్‌బోర్డ్‌ను షేర్ చేసింది. ‘బర్నింగ్ డిజైర్, కన్సిస్టెంట్ అప్రోచ్, బోల్డ్ ప్రామీస్.. ఈ ప్రయాణమే మనల్ని ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా నిలబెట్టింది. నిజాయితీ, నమ్మకంతో ఒక్కో మెట్టును పేర్చుతూ నిర్మించుకున్నాం’ అని పేర్కొంది. కాగా 2020 నుంచి RCB 90 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో టాప్‌లో ఉంది.
News September 11, 2025
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News September 11, 2025
నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.