News September 11, 2025
HYD: తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఏడాదికి PG చేరడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. SEP 19, 20న ఉ. 11 గంటల నుంచి సా. 4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫొటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600/- DD సమర్పించాలని సూచించారు.
Similar News
News March 7, 2026
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్‌ను ఆదేశించారు.
News March 7, 2026
KMR: మాదకద్రవ్యాల వినియోగం నివారణపై జిల్లా స్థాయి అవగాహన

కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ-ప్రహరీ క్లబ్స్ ఆధ్వర్యంలో సోమవారం మాదకద్రవ్యాల వినియోగం నివారణపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఎంపిక చేసిన 36 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు 7, 9వ తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొనాలన్నారు. శ్రీనివాస్, కృష్ణ, అమరేందర్ రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు.
News March 7, 2026
పార్వతీపురం: ‘అధికారులు క్షేత్రస్థాయి పర్యటించాలి’

వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్ఠ సారించి ప్రగతి కుంటుపడిన చోట క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా పర్యటించి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్షించారు. జిల్లాలో అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని స్పష్టం చేశారు. మండల అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు


