News September 11, 2025
వరంగల్: సరదా కోసం ప్రాణాల్ని బలి చేసుకోవద్దు!

వాహనాల్లో సన్‌రూఫ్ వినియోగంపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు. పిల్లలు సన్‌రూఫ్‌లోంచి బయటకు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాలు, కరెంట్ తీగలు ఉన్నచోట సన్‌రూఫ్ తెరవవద్దని, వేగంగా వెళ్తున్నప్పుడు వాడకూడదని తెలిపారు. కేవలం సరదా కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని వారు వాహనదారులకు సూచించారు.
Similar News
News March 11, 2026
రెండు దశల్లో జనగణన: ADB అదనపు కలెక్టర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన జరుగుతుందని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 226 నుంచి జూన్ 9, 2026 వరకు జరుగుతుందన్నారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితరంగా 33 అంశాలపై సమాచారం సేకరిస్తారని చెప్పారు. రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారన్నారు.
News March 11, 2026
ఆత్మ (ATMA) జగిత్యాల జిల్లా ఛైర్మన్‌గా గంగారెడ్డి

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డి జగిత్యాల జిల్లా ఆత్మ (ATMA) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News March 11, 2026
అయినవిల్లి: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి

అయినవిల్లి మండలంలో దారుణం జరిగింది. రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై 60 ఏళ్ల యడ్ల సూరిబాబు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు రెండుసార్లు ఆఘాయిత్యం చేసినట్లు SI జ్యోతి బుధవారం తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై వృద్ధుడి వికృత చేష్టలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


