News September 11, 2025

ములుగు: ట్రైబల్ వర్సిటీకి భవన నిర్మాణం ఎప్పుడు..?

image

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత భవనం కరవైంది. వనదేవతలు సమ్మక్క, సారక్క పేరు పెట్టిన ఈ యూనివర్సిటీకి ములుగు శివారులో 330 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రం రూ.889 కోట్లు కేటాయించింది. కానీ, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. బీఏ-ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులున్నాయి.

Similar News

News March 5, 2026

చల్ల నీళ్లు కావాలా.. కొనాలి కుండలు!

image

వేసవికాలం మొదలైంది. దీంతో ఎండల తీవ్రత ఎక్కువైంది. చల్ల నీళ్లు కావాలంటే మట్టి కుండలు కొనాల్సిందే అనేలా ఎండలు ఉన్నాయి. పేదోడి ఫ్రిడ్జ్‌గా భావించే మట్టికుండలకు నందికొట్కూరులో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కుండ ఆకృతులను బట్టి వ్యాపారులు ధరలను నిర్ణయించారు. ఒక కుండ రూ.100 నుంచి 250 వరకు ధర పలుకుతోంది. దిగువ భాగంలో కుళాయి ఉన్న కుండలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు.

News March 5, 2026

కేయూ పరిధిలో పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల తొలి సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల పరీక్షలు ఈ నెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 4,149 మంది విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News March 5, 2026

తూ.గో: ఖాళీ ఇంటికి రూ.1.99కోట్ల కరెంట్ బిల్లు

image

సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో వచ్చిన బిల్లు ఏకంగా రూ.1.99కోట్లుగా ఉండటంతో ఆమె షాక్‌కు గురైంది. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్‌లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.