News September 11, 2025

ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

image

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.

Similar News

News March 3, 2026

కడప జిల్లా పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్.!

image

కడప: జిల్లాలో పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీటి పదవీకాలం ఈనెల 17 నాటికి ముగియనుంది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. జిల్లాలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రెండు వారాల్లో ముగియనుంది. గత ఎన్నికల్లో వీటి అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది.

News March 3, 2026

కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

image

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్‌లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.

News March 3, 2026

కడప: ఆదాయం గణం.. సిబ్బంది శూన్యం.!

image

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల తీరు ఆదాయం ఘనం.. సిబ్బంది శూన్యం అన్నట్లుగా ఉంది. జిల్లాలో 11 AMCలు ఉన్నాయి. వీటి వార్షిక ఆదాయ లక్ష్యం రూ.14.27 కోట్లు కాగా.. ఇప్పటి వరకు <<19281818>>రూ.11.78 కోట్లు<<>> వసూలు చేశాయి. అయితే జిల్లాలోని ఏ AMCలో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేరు. సింహాద్రిపురం, ఎర్రగుంట్ల, సిద్దవటం, రాజంపేటలో రెగ్యులర్ సెక్రటరీలు సైతం లేరు. 150 గాను 40 మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.