News September 11, 2025

కరీంనగర్: రూ.947.21 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల విస్తరణ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటి మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్‌బీ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. రూ.947.21 కోట్లతో 48 పనులు చేపట్టి 616.41 కి.మీ. మేర పనులు పూర్తి చేయనున్నారు. కొత్త రోడ్లను నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడం, రిపేర్లు చేస్తారు. ఫలితంగా గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్ అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

Similar News

News September 11, 2025

WNP: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

image

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. వార్డ్ ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపించి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు.

News September 11, 2025

SEP 17న సాయుధ పోరాట దినోత్సవం: MLA

image

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న ప్రజాపాలన దినోత్సవం కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని HYDలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్‌ చేశారు. 1947 SEP 11న పోరాటం ప్రారంభమైందని, ఆ పోరాట యోధుల విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

News September 11, 2025

డ‌యేరియా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉన్నాం: నారాయణ

image

న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల నేపథ్యంలో తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, డయేరియా కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.